ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలో యువ రైతు మృతిచెందాడు. చారగొండ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో నాయిని వెంకటయ్య అనే యువ రైతు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. వెంకటయ్య మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని పలువురు నాయకులు మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.