HomeరాజకీయాలుFormer MLA of Judges who joined BRS BRS ​లో చేరిన జడ్చర్ల మాజీ...

Former MLA of Judges who joined BRS BRS ​లో చేరిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే

– మంత్రి కేటీఆర్ సమక్షంలో

గులాబీ కండువా కప్పుకున్న ఎర్ర శేఖర్​

ఇదే నిజం, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో కల్లోలం కొనసాగుతున్నది. ఇన్నాళ్లు తమకే టికెట్‌ వస్తుందని ఆశపడినవారు.. ఇప్పటివరకు ప్రకటించిన రెండు జాబితాల్లో తమ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లభించడం లేదని.. ఒక్కొక్కరుగా హస్తానికి గుడ్‌బై చెబుతున్నారు. ఇదే క్రమంలో మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ముదిరాజ్‌లను ఆర్థికంగా స్థితిమంతులను చేస్తున్నారని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img