ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలో నిర్వహించిన శ్రీ మహాగణపతి, నవగ్రహ, కనకదుర్గ, ధ్వజ స్తంభ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు బందు అద్యక్షులు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, కెతవత్ శంకర్ నాయక్, మాధవరం జనార్దన్ రావు, రాఘవా చారి, మాజీ సర్పంచ్ గంగిడి కొండల్ రెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లీ కృష్ణ, రమావత్ తులిసిరం, వడత్య బాలు, బుయ్య మహేష్, బిజిలి సుధాకర్ తదిదరులు ఉన్నారు.