Homeహైదరాబాద్latest Newsషకీల్ కొడుకు మస్త్ డేంజర్

షకీల్ కొడుకు మస్త్ డేంజర్

ఇదేనిజం, వెబ్ డెస్క్: బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు సోహెల్​ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ప్రజా భవన్​ ఎదుట ర్యాష్​ డ్రైవింగ్ చేశాడు.. అయితే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించగా.. తన స్థానంలో తన ఇంట్లో పనిచేసే డ్రైవర్​ ను ఇరికించి దుబాయ్​ పారిపోయాడు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట సీఐ దుర్గారావు సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడి మీద సైతం సస్పెండ్​ వేటు పడింది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజాభవన్ వద్ద 24వ తారీఖు తెల్లవారు జామున ఓ బీఎండబ్ల్యూ కారు ర్యాష్ డ్రైవింగ్‌తో బారీకేడ్లను ఢీ కొట్టింది. ఈ కారులో షకీల్​ కుమారుడితో పాటూ.. ఇద్దరు యువకులు, మరో ముగ్గురు యువతులు కారులో ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు.

షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా రహిల్‌ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. రహిల్‌పై గతంలోనూ జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్‌ కేసు నమోదైందన్నారు. త్వరలోనే రహిల్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. ఈ కేసులో పోలీసులు కూడా షకీల్​ కుమారుడికి సహకరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. షకీల్​ కుమారుడికి సహకరించారన్న ఆరోపణలతో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ కేసులో తన కుమారుడికి ఎటువంటి సంబంధం లేదని షకీల్​ చెప్పారు. దీంతో పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే షకీల్ కొడుకు పోలీసుల కండ్లు గప్పి దుబాయ్​ పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఈ కేసులో మరోసారి చార్జ్​ షీట్​ వేసి సమగ్రంగా విచారిస్తామని డీసీపీ విజయ్​ కుమార్​ క్లారిటీ ఇచ్చారు.

గతంలోనూ సేమ్​ సీన్​
అయితే షకీల్​ కుమారుడికి ఇది ఫస్ట్​ టైమ్​ కాదు. గతంలోనూ ఇలాగే రాష్ డ్రైవింగ్ చేయడంతో ఓ బాలిక మృతి చెందింది. మార్చి 2022లో జూబ్లీ హిల్స్​ రోడ్డు నంబర్​ 45లో షకీల్​ రాష్ డ్రైవింగ్​ చేశాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. అయితే అప్పట్లో ఎమ్మెల్సీ షకీల్​ మాట్లాడుతూ.. ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని వాదించారు. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్​ ఉన్నప్పటికీ అది తన తమ్ముడిదని చెప్పారు. తనకు తెలియకుండానే తన కజిన్​ ఎమ్మెల్యే స్టిక్కర్​ అంటించుకున్నారని చెప్పారు. మొత్తంగా అప్పట్లో షకీల్​ తన కుమారుడిని కాపాడుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయన పలుకుబడి పనిచేయలేదని తెలస్తోంది. ఇక చాలా మంది డబ్బులున్న వారి ఇండ్లల్లో ఇటువంటి యాక్సిడెంట్లు చేయడం.. మళ్లీ తప్పించుకోవడం కామన్​ అయిపోయింది. కోర్టు పరిధిలోకి వెళ్లినా పెద్దగా శిక్షలు పడటం లేదు. దీంతో ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి తప్పించుకుంటున్నారు. మరి షకీల్ కుమారుడి కేసును పోలీసులు సీరియస్​ గా తీసుకొని అతడికి శిక్ష పడేలా చూస్తారేమో అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img