ఇదే నిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ను పోలీసులు ఆయన స్వగృహం నల్లబెల్లి లో అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నిర్బందాలను కాంగ్రేస్ ప్రభుత్వం గుర్తుచేస్తుంది.
మంత్రులు వస్తే అరెస్ట్ లా..? మరీ ఇంత భయమా..?
మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రి ని కట్టించిన వ్యక్తిని హౌజ్ అరెస్ట్ చేస్తారా..? అరెస్ట్ లు చేసి పర్యటనలు ఎన్ని రోజులు చేస్తారు..భయం బాగానే ఉంది..! ఈ నిర్భందాలతో నిజాలు దాగవు, పోరాటాలు ఆగవు.
గౌరవించవలసిన వ్యక్తిని అరెస్టు చేసి నిర్బంధించడమా ఇదేమి ప్రజాస్వామ్యం.. ఇదేమి ప్రజాపాలన పేద ప్రజలు పండుగ చేసుకునే వేళ నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నాయకుని అరెస్టు చేయడం అక్రమం. పెద్ది సుదర్శన్ రెడ్డి అక్రమ హౌజ్ అరెస్టును బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.