Homeహైదరాబాద్latest NewsBREAKING: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు

BREAKING: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఈరోజు కన్నుమూశారు.11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా పని చేసారు. ఆయనకు 80 ఏళ్లు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అతను 2000 నుండి 2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2000 నుంచి 2011 వరకు బెంగాల్ సీఎంగా పనిచేసిన ఆయన.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తండ్రి మృతి చెందినట్లు కుమారుడు సుచేత‌న్ భ‌ట్టాచార్య ప్రకటించారు.

బుద్ధదేవ్ భట్టాచార్య రాజకీయ ప్రస్థానం ఇదే..!

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య నార్త్ కోల్‌కతాలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1 మార్చి 1944న జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు బుద్ధదేవ్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. 5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో బుద్ధదేవ్ భట్టాచార్య వామపక్ష పార్టీలో కీలకపాత్ర పోషించారు. వామపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఉదారవాద విధానాలను అవలంబించడంలో ప్రసిద్ధి చెందారు. బుద్ధదేవ్ భట్టాచార్య పారిశ్రామికీకరణ కోసం ప్రయత్నాలు చేశారు.

Recent

- Advertisment -spot_img