ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో నిధుల బదిలీకి సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు చేర్చారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపించింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది.