Forum For Good Governance:తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. రిటైర్డ్ అధికారులను ప్రభుత్వ సలహాదారులుగా, ఓఎస్‌డీలుగా కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కేబినెట్ హోదాలో పోస్టింగ్ ఇవ్వడాన్ని ఎఫ్‌జీజీ తప్పుపట్టింది.
పదివిలో ఉన్నప్పుడు చెప్పినట్లు విన్నందుకు ఈ పదవులు ఇచ్చారని భావించాల్సి ఉంటుందని ఎఫ్‌జీజీ పేర్కొంది. గత తొమ్మిది సంవత్సరాల్లో పలువురి పదవికాలాన్ని పొడగిస్తు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నారని తెలిపింది. ఈఎన్‌సీ పదవికాలం టైమ్ లిమిట్ లేకుండా ఉత్తర్వులు ఇచ్చారని లేఖలో పేర్కొంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ అనురాగ్ శర్మ ఇలా పలువురిని సలహాదారులుగా ప్రభుత్వం నియమించిందని తెలిపింది.
రిటైర్డ్ అధికారులు పదవిలో కొనసాగుతూ తప్పుచేస్తే ఎలాంటి చర్యలు తీసుకోడానికి ఉండదని ఎఫ్‌జీజీ వెల్లడించింది. రిటైర్డ్ అధికారులను కొనసాగింపు, పదవికాలం పొడగింపు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి లేఖ రాశారు.