లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ రేపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో జరగనుంది. అయితే ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. రేపు నాలుగో దశ పోలింగ్ లో భాగంగా ఏపీ (25), తెలంగాణ (17), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ & కాశ్మీర్ (1) లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే తెలంగాణలో 425 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 3.17 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి 45 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 12 మంది పోటీ చేస్తున్నారు. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ 35,809 కేంద్రాలు ఏర్పాటు చేసింది.