ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. మెల్‌బోర్న్‌లో డిసెంబర్ 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి 1-1తో సమం నిలిచాయి. గబ్బా వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో టెయిలెండర్ల అసాధారణ ఆటతీరుతో టీమిండియా ఓటమిని తప్పించుకుంది. అదే బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్‌ను ఓడించాలని ఆశపడుతున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రణాళికలపై ఇప్పటికే దృష్టి సారించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. బౌలింగ్‌లో సతమతమవుతున్న స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్/సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా/మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.