Homeఅంతర్జాతీయంభ‌ద్రతా మండ‌లిలో ఇండియా శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మ‌ద్ద‌తుః ఫ్రాన్స్ రక్షణ మంత్రి

భ‌ద్రతా మండ‌లిలో ఇండియా శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మ‌ద్ద‌తుః ఫ్రాన్స్ రక్షణ మంత్రి

న్యూఢిల్లీః ఐక్యరాజ్య సమితి భ‌ద్రతా మండ‌లిలో భార‌త్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశానికి ఫ్రాన్స్ మ‌ద్దతు ఇస్తుంద‌ని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే పేర్కొన్నారు. హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో గురువారం (సెప్టెంబర్ 10) ఐఏఎఫ్‌కు రఫేల్‌ యుద్ధ విమానాలను అప్పగించే కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. రఫేల్స్‌తో ఇరు దేశాల మ‌ధ్య కొత్త ర‌క్షణ బంధం ఏర్పడింది. అత్యాధునిక‌ రఫేల్ యుద్ధ విమానాల‌తో భార‌త్ సామ‌ర్థ్యం మరింత పెరిగిందని ఫ్లోరెన్స్ పార్లే అన్నారు. కొవిడ్-19 సంక్షోభ సమయంలో భారత్, ఫ్రాన్స్ పరస్పరం సహకరించుకున్నాయని ఆమె గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియాకు స‌హ‌క‌రించేందుకు ఫ్రాన్స్ క‌ట్టుబ‌డి ఉంద‌ని ఫ్లోరెన్స్ చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img