బీహార్ లో విచిత్రమైన జాబ్ ఫ్రాడ్ వెలుగు చూసింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ నుంచి యువకులకు జాబ్ ఆఫర్ అని మెసేజీలు వచ్చాయి. రూ.799 పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమ్మాయిలు ఫోటోలు పంపిస్తుంది. అమ్మాయిలు ఫోటోలు చూసి నచ్చినవారిని సెలెక్ట్ చేసుకొని ప్రెగ్నెంట్ చేయడమే ఉద్యోగం. అలా గర్భం చేస్తే రూ.13 లక్షలు చెల్లిస్తుంది. ఒకవేళ గర్భవతి చేయకపోతే.. ప్రోత్సాహకంగా రూ.5లక్షలు మాత్రమే చెల్లిస్తుంది. ఈ జాబ్ ఫ్రాడ్ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.