ప్రస్తుత కాలంలో తమ డబ్బులు పొదుపు చేయడానికి చాలా మంది చిట్టీలు కడుతున్నారు. ఇదే అదునుగా చూసిన ఓ కేటుగాడు సుమారు వెయ్యి మందిని మోసం చేసి రూ.100 కోట్లతో పరారయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య హైదరాబాద్ కు వలస వచ్చి బీకే గూడలో 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అధిక వడ్డీ ఆశ చూపి.. చిట్టీ డబ్బులు తన వద్దే ఉంచుకొని ఈనెల 21న కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. మోసపోయిన ప్రజలు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కేటుగాడిని పట్టుకునే పనిలో ఉన్నారు.