ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో దసరా పండుగ సందర్బంగా దసర బంపర్ ఆఫర్, దసర ధమాకా అనే క్యాప్షన్ తో అమాయకపు ప్రజల వద్ద నుండి డబ్బులను వసూలు చేస్తు వివిధ రకాల వస్తువులు ఫ్రిడ్జ్, మేక, కుక్కర్, కోళ్లు, మద్యం బాటిళ్లు అను బహుమతులు ఇస్తామని మోసం చేస్తున్న 8 మంది నిర్వాహకులపై కేసు నమోదు చేయడం జరిగింది. పండుగ సందర్భంగా ప్రజలు ఎవరు కూడా చీటీలు ప్రైజ్ మనీలు బహుమతుల పేర్లతో పెట్టే ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మోసపోవద్దని ఇటువంటి ప్రకటనలు ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని ధర్మపురి ఎస్సై గంగుల మహేష్ తెలిపారు.