ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలదే హవా. వాట్సాప్ అనేది రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. పుట్టినరోజులు, పండుగల శుభాకాంక్షల దగ్గరి నుంచి ఆన్‌లైన్ మార్కెట్ సమాచారం వరకూ అన్నీ వీటి ద్వారానే అందుతున్నాయి. ఇలాంటి వేదికల్లో అజ్ఞాత వ్యక్తుల నుంచి మేసేజ్‌లు వస్తే మాత్రం అనుమానించాల్సిందే. ఇటీవల వాట్సాప్‌లో రిక్రూట్‌మెంట్ మోసాలు బాగా పెరిగిపోయాయి. అపరిచిత వ్యక్తులను చేరుకోవటానికి మోసగాళ్లకు ఇది తేలికైన మార్గంగానూ మారిపోయింది.