తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పథకం అమలుపైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి స్కీమ్ అమలుకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం.