Free bus scheme : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్న ఎన్నికల హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ ఉచిత బస్సు పథకం ఒకటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇటీవలే సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. అయితే ఈ ఉచిత బస్సులు సదుపాయం కేవలం జిల్లాలకే పరిమితమవుతుందా లేక రాష్ట్రవ్యాప్తంగా వర్తింప చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై RTC అధికారులతో సీఎం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ పథకం వల్ల భారం పడినా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని సమకూర్చుకునేలా ప్లాన్ చేయాలని సలహా ఇచ్చారట. ఈ మేరకు పలు అంశాలపై అధికారులు నివేదిక రెడీ చేసి రేపో మాపో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారట.