Homeహైదరాబాద్latest Newsఈ నెల 21న కంగ్టి లో ఫ్రీ హెల్త్ క్యాంప్..!

ఈ నెల 21న కంగ్టి లో ఫ్రీ హెల్త్ క్యాంప్..!

ఇదేనిజం, కంగ్టి: సంగారెడ్డి జిల్లా, కంగ్టి మండల కేంద్రంలో ఈ నెల 21న ఉచిత మెగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు డాక్టర్ మఠం శంకర్ సోమవారం తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని సహారా హాస్పిటల్, వారిచే ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది. కావున కంగ్టి మండల ప్రజలు ఉచిత హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. కంగ్టిలోని నిర్మల పాలిక్లినిక్ లో ఉచిత వైద్య శిభిరానికి అందరికి ఆహ్వానం. ఈ నెల బుధవారం 21-8-2024 న ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉచిత క్యాంపుని చేపడుతున్నారు.

ఈ ఉచిత ఆరోగ్య క్యాంప్ లో న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్ మరియు జనరల్ వైద్యులు పాల్గొని వచ్చినటువంటి ప్రజలకు టెస్ట్లు మరియు మందులు అందజేస్తున్నారు. నరాలబలహీనత, మెడనొప్పి, తలనొప్పి, నడవలేకపోవడం, నడుము నొప్పి, వంటి సమస్యలకు డాక్టర్ ధీమంత్ రెడ్డి చేత సూచనలు ఇవ్వబడుతాయి. మరియు ప్రముఖ గైనకాలజీ డాక్టర్చే స్త్రీ ఆరోగ్య సమస్యలు, నెలవారీ ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్, గర్భ సంచి సమస్యలు మరియు ఇతర ఇతర స్త్రీ సంబంధిత సమస్యలకు డాక్టర్ గారి చేత సలహాలు ఇవ్వబడుతాయి. జనరల్ ఫిజిషియన్ చేత బి.పి., షుగర్, థైరాయిడ్, రక్త హీనత, రక్త పోటు జ్వరాలు, వంటి సమస్యలకు సలహాలు ఇవ్వబడుతాయి.

Recent

- Advertisment -spot_img