ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని బ్రాహ్మణపల్లిలో, అయోధ్యాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ యమున ఆధ్వర్యంలో, వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఇట్టి శిబిరంలో మొత్తం 41మంది విద్యార్థినులను పరీక్షించి, చిన్న చిన్న రుగ్మతలు ఉన్నవారిని గుర్తించి, చికిత్స చేసి మందులు ఇవ్వడం జరిగింది. హాస్టల్ పరిశారాలను పరిశీలించి వంటశాలను, స్టోర్ రూమును, తరగతి గదులను, డైనింగ్ హాల్ లను పరిశీలించారు. పరిశుభ్రమైన నీరు, కూరగాయలు వాడాలని సూచించారు. ప్రతి విద్యార్థి వ్యక్తీ గత శుభ్రతను తప్పకుండా పాటించాలని తెలియపరిచారు. ఇట్టి శిబిరంలో, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, కేజీబీవి ప్రధానోపాధ్యాయురాలు సునీత, సూపర్వైజర్ గణేష్, అరుణ, స్టాఫ్ నర్స్ రజిత, హెల్త్ అసిస్టెంట్ సర్దార్ బాబు, లాలు, ఏ ఎన్ ఎం. రజిత, ఆశ, సునీత పాల్గొన్నారు.