ఇదే నిజం, గూడూరు: అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని, సీతానాగారం గ్రామపంచాయతీ లో గల గిరిజన ఆశ్రమ పాఠశాల బాలుర లో, అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విద్యాధికారి డాక్టర్ బి. యమున ఆధ్వర్యంలో, ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 401 మంది పిల్లలకు గాను, చిన్న చిన్న జబ్బులతో బాధపడుతున్న 51 మంది పిల్లలకు పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది.
అందులో నలుగురు జ్వరపీడుతులను గుర్తించి, రక్త నమూనాలు సేకరించడం జరిగింది. క్యాంప్ అనంతరం డాక్టర్ యమున వైద్య సిబ్బందితో కలిసి, ఆశ్రమ పాఠశాల పరిసరాల ప్రాంతాన్ని సందర్శించి కిచెన్, స్టోర్ రూమ్ , వంటగదిని పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలంలో పిల్లలు తమ వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించాలని సూచనలు చేశారు. ఈ వైద్య శిబిరంలో గురుకుల ప్రిన్సిపాల్ పోరిక గంగులు, హెచ్ ఈ ఓ. లోక్య నాయక్, సూపర్వైజర్లు గణేష్ , హేమలత హెల్త్ అసిస్టెంట్ సర్దార్ బాబు, లాలు ఏఎన్ఎం ప్రమీల, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.