ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో స్వాతి దంతవైద్యశాల జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించి డాక్టర్ స్వాతి గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు.ఉచిత వైద్యశిబిరం నివహించిన స్వాతి దంతవైద్యశాల యాజమాన్యం వారికి మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవిందుల లావణ్య-జలపతి ధన్యవాదాలు తెలియజేశారు.