ఇదే నిజం, ధర్మపురి టౌన్: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రేపు అనగా 12.09.2024 నాడు ధర్మపురి బ్రాహ్మణ సంఘంలో వైద్య ఆరోగ్య శాఖ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. దీని యందు అన్ని రకాల జ్వరములకు, డెంగ్యూ, మలేరియా,చికున్ గున్యా, టైఫాయిడ్ వ్యాధులకు డాక్టర్ లచె పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు ఉచితముగా నిర్వహించి మందుల పంపిణి చేయనున్నారు. కావున పట్టణ మరియు మండల ప్రజలు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని శిబిరము ను విజయవంతం చేయగలరు. ఉదయం 9 గంటల నుండి మద్యహ్నం 2.00 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిభిరం ఉంటుంది. శిబిరమునకు వచ్చువారు ఆదార్ కార్డ్, మొబైల్ ఫోన్ తీసికొని రాగలరు.