ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ ప్రారంభించారు.ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 120 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 70 మంది శస్త్ర చికిత్సలకు ఎంపికయ్యారు. ఇందులో 35 మందిని రేకుర్తి కంటి ఆసుపత్రికి ఆపరేషన్ నిమిత్తం పంపించగా మిగతా 35 మందికి మరో తేదీ నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది.ఈ క్యాంపులో షుగర్ పరీక్ష చేయడంతో పాటు భోజన వసతి కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ ముస్కు కరుణాకర్ రెడ్డి,రేకుర్తి కంటి ఆసుపత్రి చైర్మన్ లయన్ కొండ వేణుమూర్తి,వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్,రీజనల్ తన్నీరు రాజేందర్,కార్యదర్శి సాయిని నరహరి,కోశాధికారి శాతల సత్యనారాయణ,మహంకాళి శేఖర్,బోల్లం రమేష్,చాడ వెంకటరమణ,అశోక్ రావు,బలభక్తుల కిషన్,సురేష్,తాడూరి సత్యనారాయణ,ప్రజలు పాల్గొన్నారు.