Homeహైదరాబాద్latest Newsఉచిత ఇసుక..10 రోజుల్లోగా మార్పు రాకుంటే ఉపేక్షించేది లేదు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఉచిత ఇసుక..10 రోజుల్లోగా మార్పు రాకుంటే ఉపేక్షించేది లేదు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఉచిత ఇసుక లక్ష్యాన్ని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు హామీ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఉచిత ఇసుక విధానంపై అమాత్యునితో కీలకంగా చర్చించారు. ఉచిత ఇసుక విధానంపై వచ్చిన ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు .. 10 రోజుల్లోగా మార్పు రాకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా లభ్యమవుతోంది అని తెలిపారు. అన్ని ఆంక్షలు తొలగించి ఇసుకను ఉచితంగా అందించాలని, రవాణా, తవ్వకాల ఛార్జీలు వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇసుకను తవ్వి తీసుకెళ్తే ఎలాంటి రుసుము వసూలు చేయరాదని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమాలు జరగకుండా ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత వహించాలన్నారు. ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయని, మళ్లీ అలాంటివి జరగకూడదని సీఎం వివరించారు.

Recent

- Advertisment -spot_img