ఇదే నిజం, కరీంనగర్ ఎడ్యుకేషన్: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ఎస్సీ .. డీఎస్సీఅభ్యర్థులకు రెండు నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్, కరీంనగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యదర్శి పీ నాతనియే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి జూన్ 2 వరకు భోజన వసతితో కూడిన రెసిడెన్షియల్ శిక్షణ ఉంటుందని, అభ్యర్థులు ఈ నెల 26 లోగా https://www.tsstudycircle.co.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.