Homeహైదరాబాద్latest Newsరోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి చేయూత

రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి చేయూత

ఇదే నిజం, రాయికల్ : ఇటీవల మండలంలోని కొత్తపేట గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మ్యాడారపు అనిల్ కుమార్ (22) కు స్నేహితులు బాసటగా నిలిచారు. భూపతిపూర్ గ్రామానికి చెందిన కచేరి కాడ ముచ్చట్లు అనే గ్రూప్ సభ్యులు చలించి మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్‌లో అండగా ఉంటామన్నారు. అనిల్ కుమార్ కడెం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. మృత్తునికి భార్య, 7 నెలల కుమార్తె ఉన్నారు. దాతలెవరైనా ఉంటే సాయం చేయాలని బంధుమిత్రులు కోరారు.

Recent

- Advertisment -spot_img