Homeహైదరాబాద్latest Newsపి.హెచ్.సి లలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పి.హెచ్.సి లలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

  • సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
  • నంది మేడారం పి.హెచ్.సి ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఇదేనిజం, ధర్మారం: నంది మేడారం పి.హెచ్.సి.లలో ఔట్ పేషెంట్ లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ధర్మారం మండలంలోని నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జనరల్ వార్డ్, లేబర్ రూమ్, ఫార్మసీ, ల్యాబరేటరినీ పరిశీలించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వివిధ వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజు నమోదవుతున్న ఔట్ పేషెంట్, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతి రోజు జరుగుతున్న ఔట్ పేషెంట్ వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఔట్ పేషెంట్ లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు. గర్భిణీ స్త్రీల ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్, చెక్ అప్ 100 శాతం జరిగేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పని చేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా మొదలగు వ్యాధుల చికిత్స నిమిత్తం అవసరమైన మందులు, వ్యాధి పరీక్షా కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సీజనల్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె.వి. సుధాకర్ రెడ్డి, మేడారం వైద్యాధికారి డాక్టర్ సుష్మీత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img