Homeహైదరాబాద్latest NewsFun Bucket Bhargav : 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. యూట్యూబర్ కి 20...

Fun Bucket Bhargav : 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. యూట్యూబర్ కి 20 ఏళ్ల జైలు శిక్ష..!

Fun Bucket Bhargav : రీల్స్ ద్వారా ఫేమ్ సంపాదించిన ఫన్ బకెట్ భార్గవ్ (ఫన్ బకెట్ భార్గవ్) ఆ తర్వాత తన స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు, ఇప్పుడు మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో కఠిన కారాగార శిక్ష పడింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విశాఖపట్నం పోక్సో కోర్టు భార్గవ్‌కు ఈ శిక్ష విధించగా.. బాధిత బాలికకు రూ.4 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. వీడియో తీస్తానన్న సాకుతో 14 ఏళ్ల బాలికను బెదిరించి లైంగికంగా వేధించడంతో బాలిక గర్భం దాల్చింది. దీనిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భార్గవ్‌పై దిశ చట్టం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img