న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 344/3 స్కోరు చేసింది. అయితే ఇన్నింగ్స్‌లోని 56వ ఓవర్‌లో ఓ ఫన్నీ ఇన్సిండెంట్ జరిగింది. పంత్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని కివీస్ ఫీల్డర్లు చేజార్చారు. ఈ క్రమంలో పంత్‌ను రెండో పరుగు కోసం వద్దని వారిస్తూ సర్ఫరాజ్ ఖాన్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘వద్దు బాబోయ్ వద్దు..’ అన్నట్లుగా సర్ఫరాజ్ టెన్షన్‌తో చేసిన ఫీట్ నవ్వులు పూయించింది.