Homeహైదరాబాద్బీజేపీ చొర‌వ‌తో డెడ్ బాడీ అప్ప‌గింత‌

బీజేపీ చొర‌వ‌తో డెడ్ బాడీ అప్ప‌గింత‌

హైద‌రాబాద్ః రాయదుర్గం సన్ షైన్ హాస్పిటల్ లో 5 రోజుల క్రితం కర్ణాటకకు చెందిన మురళీధర్ అనే వ్యక్తి కరోనాతో చేర‌డం జరిగింది. అత‌ని కుటుంబ స‌భ్యులు నిన్నటి వరకు రూ.5.5 ల‌క్ష‌లు కట్టారు. ఈరోజు పొద్దున అత‌ను చనిపోవడం జరిగింది. కానీ ఆస్ప‌త్రి మేనేజ్‌మెంట్ ఇంకా రూ.4.5 ల‌క్ష‌లు డెడ్ బాడీ తీసుకెళ్లాలని హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో దిక్కుతోచ‌న కుటుంబ స‌భ్యులు స్థానిక బీజేపీ నాయ‌కుల‌కు చెప్ప‌డంతో వారు అక్కడికి వెళ్లడం జరిగింది. హాస్పిటల్ చేరుకున్న బీజేపీ నాయ‌కులు ఆస్ప‌త్రి మేనేజ్‌మెంట్‌ వాళ్ళతో మాట్లాడి డబ్బులు కట్టకుండా డెడ్ బాడీనీ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి దర్శి బంగారు శృతి, బండారి రాధిక, విజయ లక్ష్మి, మణికొండ మాజీ ఉప సర్పంచ్ నాగేష్ , పీసరి శ్రీనివాస్, వేణు కుమార్, నీలం నరేందర్ ముదిరాజ్, మక్తల స్వామి గౌడౌ, గచ్చిబౌలి డివిజన్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img