Gachibowli : ఐటీ ఏరియా గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం కాల్పుల కలకలం రేగింది. ప్రిజం పబ్ కు వచ్చిన దొంగను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, అతను పోలీసులపై కాల్పులు జరిపాడు. రెండు రౌండ్ల కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి మరియు ఒక పబ్ బౌన్సర్ గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే ఆ నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.