Gachibowli : ఐటీ ఏరియా గచ్చిబౌలిలో (Gachibowli) శనివారం సాయంత్రం ప్రిజం పబ్ లో కాల్పులు జరిగాయి. ఒక దొంగను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, అతను పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి మరియు ఒక పబ్ బౌన్సర్ గాయపడ్డారు. అయితే ఈ కాల్పుల ఘటన గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ కాల్పులు జరిపిన దొంగ పేరు బత్తుల ప్రభాకర్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేరస్థుడు ప్రభాకర్‌పై 80 కేసులు ఉన్నట్లు ఇప్పటికే తేలింది. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 16 కేసుల్లో ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ అని పోలీసులు పేర్కొన్నారు. అతని నుండి నుండి 2 తుపాకులు, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.