Gaddam Meghana : 18 ఏండ్ల తెలుగమ్మాయి న్యూజిలాండ్ యువ ఎంపీగా ఎన్నిక
Gaddam Meghana : న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది.
ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన (18) యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైంది.
గ్రాడ్యుయేషన్ చదువుతున్న మేఘన.. చదువుతో పాటు సోషల్ సర్వీస్ చేయడంలో ముందుండటంతో న్యూజిలాండ్ ఎంపీగా ఎన్నికైంది.
వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్ పదవికి ఎంపికైంది.
ఉద్యోగరీత్యా గడ్డం మేఘన తల్లిదండ్రులు గడ్డం రవికుమార్ – ఉష దంపతులు 2001లో న్యూజిలాండ్ వెళ్లి సెటిల్ అయ్యారు.
అక్కడే మేఘన పుట్టి పెరిగింది. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.
Volcano : సముద్రంలో బద్దలైన అగ్నిపర్వతం.. ప్రమాదంలో ఆ దేశాలు
Overheating Laptop : ల్యాప్‌టాప్ వేడెక్కుతుందా.. ఏం చేయాలి
స్కూల్ డేస్ నుంచే మేఘన పలు చారిటీ కార్యక్రమాలు చేపడుతుంది.
స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథా శరణాలయాలకు అందజేస్తుంది.
వలస వచ్చిన ఇతర దేశాల శరణార్థులకు విద్య, కనీస వసతులు కల్పించడంలోనూ సహాయపడుతుంది.
దీంతో ఆమె సేవలను గుర్తించిన న్యూజిలాండ్ ప్రభుత్వం యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా నామినేట్ చేసింది.
గత ఏడాది డిసెంబర్ 16న ఆమెను పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపిక చేసినట్లు మేఘన కుటుంబానికి వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్ నాన్ డమోలెస్ తెలియజేశారు.
మేఘన ఫిబ్రవరిలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనుంది.
Fixed Deposit : ఎఫ్‌డీపై వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ
Pigs as gifts : ఈ స్కూల్‌లో స్టూడెంట్స్‌కు పందులే బహుమతిగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..