రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాలు సంక్రాంతి పండుగా కానుకగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఈ సినిమాలకి టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతిచ్చిందని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. తక్షణమే అందుకు సంబంధించిన ఉత్తర్వులు రద్దు చేయాలని పిల్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషిన్ లో ప్రతివాదులుగా ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమాల చిత్రబృందాన్ని పిటిషనర్ చేర్చాడు. ఈరోజు ఈ అంశంపై ఏపీ హైకోర్టు విచారించనుంది.