Homeహైదరాబాద్latest News'గేమ్ ఛేంజర్' మూవీ 'మెగా మాస్' ఈవెంట్ డేట్ వచ్చేసింది..! ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో..

‘గేమ్ ఛేంజర్’ మూవీ ‘మెగా మాస్’ ఈవెంట్ డేట్ వచ్చేసింది..! ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో..

రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమా ఈవెంట్ అమెరికాలోని డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్ TX 75040 లో సాయంత్రం 6:00 PM జరుగుతుంది అని తెలిపారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు అమెరికాలో ఎలాంటి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించలేదు. అలాంటి ఘనత ‘గేమ్ ఛేంజర్’ మూవీ సాధించింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img