Homeహైదరాబాద్latest News‘గేమ్ ఛేంజర్’ మూవీ.. ఊర మాస్ టీజర్ వచ్చేసింది..రికార్డుల వేట మొదలు..!

‘గేమ్ ఛేంజర్’ మూవీ.. ఊర మాస్ టీజర్ వచ్చేసింది..రికార్డుల వేట మొదలు..!

రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా టీజర్‌ ఈవెంట్‌ను లక్నోలో గ్రాండ్‌గా నిర్వహించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆన్ లైన్ టీజర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్ లో రామ్ చరణ్ తన లుక్స్ తో ఇరగదీసాడు. ఒక తండ్రిగా.. ఒక స్టూడెంట్ గా.. ఒక ఆఫీసర్ గా ఇలా చాలా డిఫరెంట్ లుక్స్ తో రామ్ చరణ్ ఆకట్టుకున్నాడు. శంకర్ ఈ సినిమాను తన స్టైల్ లో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ టీజర్ తో
సినిమా పై భారీ అంచనాలు ఇంకా పెరగనున్నాయి. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img