Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి ”గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఓటీటీలోకి ”గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ”గేమ్ ఛేంజర్”(Game Changer). ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా కియారా అద్వానీ నటించింది. సంక్రాంతి పండుగా కానుకగా ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ దీని స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అమెజాన్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

Recent

- Advertisment -spot_img