తెలంగాణలో భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని భారీ గణనాథుడు కొలువుదీరాడు. బస్తర్ పట్టణానికి సమీపంలో దంతేవాడ జిల్లాలోని ఫరస్ పాల్ గ్రామంలో బైలాడిలా కొండపై సుమారు 3000 అడుగుల ఎత్తులో గణనాథుడు వెలిశాడు. దట్టమైన కీకారణ్యం లాంటి అడివిలో భారీ ఎత్తులో కొండ శిఖరాగ్రాన “దోల్కల్ గణేష్” గా వెలిసిన గణపయ్య విగ్రహం కథ నేటికీ రహస్యంగానే ఉంది.