ఈ ఏడాది వినాయకచవితికి ముంబైలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్ ‘మహాగణపతి’ వార్తల్లో నిలిచారు. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఈ గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. దీంతో దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందింది. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్తగా ఈ గణేశుడి వేడుకలకు రూ.400.58 కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు.