Gandhi Bhavan : హైదరాబాద్లో మరోసారి నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జాప్యాన్ని ఖండిస్తూ నిరుద్యోగులు ఆందోళన చేసారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు గాంధీ భవన్ (Gandhi Bhavan) ముట్టడించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మాట తప్పడంపై ఆగ్రహం నిరుద్యోగులు వ్యక్తం చేసారు. 2024 అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తానని ఇచ్చిన హామీ ఏమిటని నిరుద్యోగులుప్రశ్నించారు. గాంధీభవన్ లో నిరుద్యోగులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాల చేసారు.