Homeతెలంగాణదుర్గంధభరిత ‘గాంధీ’ సొగసు చూడతరమా..

దుర్గంధభరిత ‘గాంధీ’ సొగసు చూడతరమా..

హైదరాబాద్​: రాష్ట్రానికే తలమానికమైన గాంధీ హాస్పిటల్​ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దుర్గంధభరితంగా మారింది. కరోనా వైరస్​ వ్యాప్తించిన తర్వాత గాంధీని కేవలం కోవిడ్​ ట్రీట్​మెంట్​కు సఫరేటుగా కేటాయించారు. దాంతో అటూ వెళ్లేందుకు కూడా శానిటైజ్​ సిబ్బంది సైతం జంకుతున్నారు. ఫలితంగా ఏ వార్డులో చూసిన అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. ఇటీవల కోవిడ్​ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వం అన్ని హాస్సిటల్స్ లో అగ్ని మాపక యంత్రాలను చెక్​ చేయాలని చెప్పినా అధికారులు గాంధీ వైపు చూడలేదు. చాలా వార్డుల్లో ఫైర్​ యంత్రాలు పనికిరాకుండా దర్శనమిస్తున్నాయి. నిత్యం వాటిని చూసుకుంటూనే అధికారులు పోతారు తప్పితే వాటిని పట్టించుకున్న పాపాన పోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది.
బాత్రూమ్​లో అడుగు పెట్ట వీలు లేదు
కోవిడ్​ వార్డుల్లోనూ టాయిలెట్స్ లో అపరిశుభ్రత అధికంగా ఉందని, కనీసం రోజుకు ఒక్కసారైనా క్లీన్​ చేసే వారు కరువయ్యారని గతంలో వీడియోలను కోవిడ్​ బాధితులు విడుదల చేయడం మనం ఇంకా మర్చిపోలేదు. సాధారణ రోజుల్లోనే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయంటే ఇక వర్షాకాలంలో పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతా బాగానే ఉందని ఓ పక్క వైద్యాధికారులు, మరోపక్క ప్రభుత్వం పైకి ప్రకటనలు చేస్తున్న వాస్తం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. మరో గత్యంతరం లేక భరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు, ప్రభుత్వం గాంధీలో పారిశుధ్యంపై ఫోకస్​ పెట్టాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img