Homeజిల్లా వార్తలుగణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ చంద్రశేఖర్ రెడ్డి

గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ చంద్రశేఖర్ రెడ్డి

ఇదేనిజం, కంగ్టి: కంగ్టి పోలీస్ సర్కిల్ పరిధిలోని కల్హేర్, సిర్గాపూర్ మండలల్లో రేపటి నుండి జరగబోయే గణేష్ నిమజ్జనం కార్యక్రమాలలో ఎలాంటి అవ్వాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం సిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ….వినాయక నిమజ్జనంలో ప్రజలందరూ భక్తిశ్రద్దాలతో ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలన్నారు. వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్ లకు అనుమతి లేదని అన్నారు. నిమజ్జన కార్యక్రమలో చెరువులు, కుంటాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు.ముఖ్యంగా చిన్నారులను నీళ్లలోనికి అనుమతించొద్దని సూచించారు.శాంతి భద్రతలకు విఘతం కలగకుండా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుకోవాలని కోరారు.ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img