Homeజిల్లా వార్తలుధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా క్యాంపు కార్యాలయంలోనీ విఘ్నేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల నాయకులతో కలసి గణపతి భజన సంకీర్తనలు నడుమ గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ధర్మపురి గోదావరిలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్,మున్సిపల్,రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని, లైటింగ్ ను ఏర్పాటు చేయాలని,ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవలని,ప్రజలు భక్తి శ్రద్దలతో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగనభట్ల దినేష్, వేముల రాజేష్, ధర్మపురి సిఐ రామ నర్సింహారెడ్డి, ఎస్ ఐ. జి.మహేష్,జక్కు రవీందర్, సుముక్, దాసరి పురుషోత్తం, ఆశెట్టి శ్రీనివాస్,రాపర్తి సాయి, చీపిరి శెట్టి రాజేష్, ఫాల గణేష్, కాసెట్టి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img