Journalist attacked by a mob in khammam
Khammam News: Khammam నగరంలో ఒక ప్రముఖ దిన పత్రికలో క్రైం రిపోర్టర్ గా పని చేస్తున్న “నల్లి శ్యామ్” అనే విలేకరిపై రౌడీ మూక హత్యాయత్నానికి పాల్పడింది. బుధవారం రాత్రి వేళ శ్యామ్ ఆఫీస్ లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు రౌడీ షీటర్లు అతని ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీ కొట్టారు. కింద పడిపోయిన శ్యామ్ తేరుకుని పైకి లేచేలోపే అతన్ని కత్తులతో పొడవడానికి యత్నించారు. ప్రవీణ్ అనే దుండగుడితో పాటు మరో నలుగురు రౌడీ షీటర్లు దాడికి ప్రయత్నించగా వారి నుంచి శ్యామ్ తెలివిగా తప్పించుకున్నాడు. “చంపేసి నీ శవాన్ని కూడా దొరక్కుండా మాయం చేస్తాం.”అంటూ రౌడీ షీటర్లు బెదిరిస్తూ విలేకరిపై జరిపిన దాడిలో అతనికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన స్పందించిన రెండో పట్టణ పోలీసులు రౌడీ మూకలను వెంబడించి పాలేరు సమీపంలో కారును అడ్డగించి పట్టుకున్నారు.