Homeతెలంగాణతెలంగాణలో గంగా యమునా తెహజీబ్​

తెలంగాణలో గంగా యమునా తెహజీబ్​

– ముస్లిం బిడ్డల కోసం ప్రత్యేక గురుకులాలు
– పేద విద్యార్థులకు విదేశీ విద్య
– హోంమంత్రి మహమూద్​ అలీ

ఇదేనిజం, హైదరబాద్​: తెలంగాణ రాష్ట్రంలో గంగాజమునా తెహజీబ్​ కొనసాగుతోందని హోంమంత్రి మహమూద్​ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు తీసుకొచ్చామని చెప్పారు. 50 ఏండ్లుగా ముస్లింలకు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో సెక్యులర్‌ తెలంగాణ కొనసాగుతున్నదని చెప్పారు. ముస్లిం బిడ్డల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటుచేశామన్నారు. పేద ముస్లిం ఆడబిడ్డలకు షాదీ ముబారక్‌ ఒక వరమని తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మైనార్టీ నేతలతో కలిసి మంత్రి మహమూద్‌ అలీ మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థులకు కూడా విదేశీ విద్య అందిస్తున్నామన్నారు. 3 వేల మంది విద్యార్థుల విదేశీ విద్యకు సహాయం చేశామని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.2,200 కోట్ల బడ్జెట్‌ కేటాయించామన్నారు. ఇది కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే అనేక రెట్లు ఎక్కవ బడ్జెట్‌ అన్నారు.

Recent

- Advertisment -spot_img