Homeహైదరాబాద్latest Newsగంగారెడ్డి హత్య …జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

గంగారెడ్డి హత్య …జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగారెడ్డి హత్య.. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి గ్యాంగ్ ఈ దాడికి పాల్పడిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నాయకుల అరాచకాలపై పదేళ్లుగా పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక విలువలను కాపాడాలని, పార్టీ ఫిరాయింపులను నివారించాలని ప్రధాన పార్టీలను కోరారు. ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తుచేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, సుస్థిరంగా ఉందన్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక హైకమాండ్ కు లేఖ రాస్తున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img