Homeహైదరాబాద్latest Newsబిగ్బాస్ హౌస్ నుండి గంగవ్వ ఎలిమినేట్.. కారణం ఇదే..?

బిగ్బాస్ హౌస్ నుండి గంగవ్వ ఎలిమినేట్.. కారణం ఇదే..?

బిగ్బాస్ తెలుగు సీజన్ 8 హోరా హోరీగా సాగుతుంది. ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షో పదో వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ పదో వారం నామినేషన్లు జోరుగా జరిగాయి. అయితే ఈ వారం నామినేషన్స్ ఏడుగురు పోటీదారులు ఉన్నారు. వారిలో నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు.అయితే ఈ వారం ఇంటి నుంచి వెళ్లే వారిలో గంగవ్వ కూడా ఉండబోతోందని తెలుస్తుంది.ఈ సీజన్‌లో వెల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఫిజికల్ టాస్క్‌లో విజయం సాధించి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. కానీ గంగవ్వ వయసు దృష్ట్యా బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్‌లు, ఆటల్లో పాల్గొనకుండా దూరంగా ఉంచారు. ఇదిలావుంటే ఇంట్లోనే ఉంటున్న గంగవ్వకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. కాళ్లు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని గత శనివారం ఎపిసోడ్‌లో నాగార్జునతో తన బాధను చెప్పింది. గంగవ్వ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా మళ్లీ ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img