తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 8’ ఏడవ వారం నామినేషన్లు మంగళవారం పూర్తయ్యాయి. ఈ వారంలో 9 మంది నామినేట్ అయ్యారు. వారిలో గౌతమ్ కృష్ణ, నిఖిల్, నాగ మణికంఠ, నబీల్, యష్మీ గౌడ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, అవినాష్ మరియు ప్రేరణ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమోలో గంగవ్వ, విష్ణుప్రియ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇందులో విష్ణుప్రియ తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటంపై ఎమోషనల్ గా మాట్లాడింది.. . ఈ మాటలు విన్న గంగవ్వ వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది.‘నాన్న ఎక్కడ ఉంటాడు’ అని అడిగింది గంగవ్వ. నాన్న ఊర్లో ఉన్నారు’’ అని విష్ణుప్రియ చెప్పింది.మా అమ్మకు నాన్నతో మాట్లాడటం ఇష్టంలేదు. అయితే అమ్మ కోసం నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మిస్ అయినా.. నాన్నతో నేను మాట్లాడలేదు అని విష్ణుప్రియ చెప్పింది. దీంతో అది విని గంగవ్వ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. వెంటనే విష్ణుప్రియ గంగవ్వను ఓదార్చింది. అయితే కొన్నేళ్ల క్రితం విష్ణుప్రియ తల్లి చనిపోయింది.
.