బిగ్ బాస్ సీజన్ -8లో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఆదివారం కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ‘స్టార్ మా’ రిలీజ్ చేసింది. అయితే హౌస్ లోకి మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ మరోసారి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గతంలో సీజన్-4లో కంటెస్టెంట్గా హౌస్కు వెళ్లిన ఆమె ఆనారోగ్యంతో మధ్యలోనే బయటికి వచ్చేశారు. మరి ఇప్పుడు మళ్లీ హౌస్లోకి వెళ్లనున్నారా? లేదా? అనేది మరికాసేపట్లో తెలియనుంది.