విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా రూరల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మూవీని డిసెంబర్ 8న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన మేకర్స్ కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా కన్ఫర్మ్ చేశారు. రూరల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.